Page Loader
అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు 

అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ నుంచి విపక్షాలు (I.N.D.I,A) కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మూడో రోజు మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఆమె మాట్లాడుతుండగానే సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. 2013లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్న మోర్గాన్ స్టాన్లీ నివేదిక, ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించినట్లు పేర్కొందని నిర్మలా గుర్తుచేశారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు తొలిసారిగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్ధిక మంత్రి మాట్లాడుతుండగా వాక్ అవుట్ చేసిన విపక్ష సభ్యులు