
Maruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది.
తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఈ సంస్థ,గతేడాది ఈ సమయంలో అందించిన ఫలితాలతో పోలిస్తే, సమీకృత నికర లాభం 1.04 శాతం తగ్గి రూ.3,911.1 కోట్లకు పరిమితమైంది.
అయితే, సంస్థ ఆపరేషన్స్ నుంచి వచ్చిన ఆదాయంలో 6.37 శాతం వృద్ధి నమోదు చేసి, రూ.40,920.1 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.38,585.2 కోట్లుగా ఉంది.
ఈ సారి అత్యధిక వార్షిక విక్రయాలు,ఎగుమతులు చేసినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.
దేశీయంగా అత్యధిక కార్లను ఎగుమతి చేసిన సంస్థగా ఇది వరుసగా నాలుగోసారి నిలిచింది.
వివరాలు
'ఈ విటారా' విక్రయాలు సెప్టెంబర్ నుంచి..
భారత్ నుంచి ఎగుమతయ్యే ప్యాసింజర్ కార్లలో 43 శాతం ఈ కంపెనీ వాటా కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో, బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.135 బోనస్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ డివిడెండ్ మారుతీ సుజుకీ బీఎస్‌ఈలో నమోదైనప్పటి నుంచి చెల్లించిన అత్యధిక డివిడెండ్.
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు 'ఈ విటారా' విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ కారు, కంపెనీ నుంచి వస్తున్న తొలి బ్యాటరీ వాహనం కావడం విశేషం. దీన్ని గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ కారు కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా, 100 దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు.
వివరాలు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకధాటిగా 500 కిలోమీటర్లు
వీటిలో జపాన్,ఐరోపా దేశాలు కూడా ఉన్నాయి. కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తరువాత, ఛైర్మన్ ఆర్.సి. భరద్వాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
2025-2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు 70,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, వీటిలో అత్యధిక భాగం ఎగుమతులకు సంబంధించి ఉంటుందని చెప్పారు.
ఈ కారు తొలిసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించబడింది.
దీన్ని బీఈవీ ప్లాట్‌ఫామ్ హెర్టెక్ట్ ఈపై నిర్మించారు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో, 49 కిలోవాట్ల మరియు 61 కిలోవాట్ల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
ఒక్కసారి ఛార్జ్ చేసినప్పుడు, ఈ కారు ఏకధాటిగా 500 కిలోమీటర్ల ప్రయాణాన్ని చేయగలదు.