LOADING...
Meesho IPO: మీషో ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ నుండి అలోట్‌మెంట్ వరకు.. ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..
ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..

Meesho IPO: మీషో ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ నుండి అలోట్‌మెంట్ వరకు.. ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఈ కామర్స్ రంగంలో Meesho మంచి గుర్తింపు సంపాదించుకుంది. మార్కెట్‌లోని తీవ్రమైన పోటీని ఎదుర్కొని,జీరో కమిషన్ మోడల్ ద్వారా చిన్న వ్యాపారులు,రీసెల్లర్స్, సాధారణ వినియోగదారులను ఆకర్షించడం Meeshoకు సాధ్యమైంది. ఇప్పుడు ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులు సేకరించేందుకు ముందుకు వచ్చింది. Meesho IPOకి మార్కెట్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొన్నది. ఈ IPO ప్రైమరీ మార్కెట్‌లో డిసెంబర్ 2025లో ప్రారంభం కానుంది. వివరాలను చూడండి: IPO ప్రారంభం: 2 డిసెంబర్ 2025 IPO ముగింపు: 4 డిసెంబర్ 2025 అలోట్‌మెంట్ ప్రకటన: 5 డిసెంబర్ 2025 రిఫండ్స్ & డిమ్యాట్ క్రెడిట్: 8 డిసెంబర్ 2025 ఎక్స్ఛేంజ్ లిస్టింగ్: 9 డిసెంబర్ 2025

వివరాలు 

కంపెనీ ఫైనాన్షియల్ పనితీరు: 

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మొత్తం షేర్లలో 10% ఫిక్స్ చేసారు. మొత్తం సుమారు ₹4,250 కోట్ల విలువైన షేర్లను సేకరించడానికి Meesho ప్రయత్నిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ (OFS) ప్రక్రియలో 17,56,96,602 షేర్లు జారీ చేయనున్నారు. ఇష్యూ ప్రైస్, లార్జ్ సైజ్, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. Meesho ఆదాయం పెరిగినప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగుదల కనిపించిందని చెప్పవచ్చు. అయితే 2025లో నష్టం భారీ స్థాయికి చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నష్టం ₹3,941 కోట్లు, ఆదాయం ₹9,389 కోట్లు నమోదు అయ్యింది.

వివరాలు 

కంపెనీ ఫైనాన్షియల్ పనితీరు: 

కంపెనీ బలమైన లాజిస్టిక్స్ సదుపాయాలకి ప్రసిద్ధి చెందింది. Valmo లాజిస్టిక్స్ విభాగం మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించుకుంది. Meeshoకు మొత్తం 85,000కి పైగా డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. Meesho కామర్స్ మోడల్ భవిష్యత్తులో మంచి వినియోగదారుల పెరుగుదలను సూచిస్తోంది. ముఖ్యంగా మిడ్-క్లాస్ వినియోగదారులు కంపెనీకి ప్రధాన ఆస్తిగా ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement