MobiKwik IPO: రేపు మోబిక్విక్ ఐపీఓ ప్రారంభం.. GMP, ముఖ్య తేదీలు, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ (Mobikwik) తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లో ప్రవేశించనున్నది. ఈ ఐపీఓ బుధవారం ప్రారంభమవుతుంది. ఇందులో మొబిక్విక్ షేర్ ధర రూ.265-279 మధ్య ఖరారు చేసింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.572కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 11 నుంచి 13తేదీల మధ్య ఐపీఓ ఉమ్మడి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు ఒక లాట్‌లో 53షేర్లను కొనుగోలు చేయాలి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో మొబిక్విక్ షేర్లు రూ.132 ధరపై ట్రేడ్ అవుతున్నాయని స్టాక్ మార్కెట్ పరిశీలకులు తెలిపారు. షేర్ల కేటాయింపు శనివారం రోజు జరగనుందనే అంచనాలు ఉన్నాయి,ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఆలస్యం జరిగితే కేటాయింపు 16న జరుగుతుంది.
ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్
ఈ ఐపీఓ ద్వారా సేకరించే రూ.572 కోట్ల నిధుల్లో, రూ.150 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధికి, రూ.107 కోట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్, డెవలప్‌మెంట్ కోసం, రూ.135 కోట్లు పేమెంట్ సర్వీసుల విస్తరణకు, రూ.70.2 కోట్లు చెల్లింపు వస్తువులు, కార్పొరేట్ అవసరాల కోసం ఖర్చు చేయాలని మొబిక్విక్ నిర్ణయించింది. ఈ ఐపీఓ మేనేజర్లుగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవహరిస్తున్నాయి.