Page Loader
Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం
వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం

Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2024
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో ఐటీ కంపెనీలు పడ్డాయి. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా అదే బాటలోకి సాఫ్ట్‌ వేర్ దిగ్గజ కంపెనీ సేల్స్‌ఫోర్స్ (Salesforce) వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్ ప్రకారం అక్టోబర్ 1 నాటికి ఉద్యోగులందరూ తమ కార్యాలయాలకు తిరిగి రావాలని మెమోలను ఇచ్చింది.

Details

టీమ్ వర్క్ ను పెరగాలంటే ఆఫీసుకు రావాల్సిందే

సేల్స్, వర్క్‌ప్లేస్ సర్వీసెస్, డేటా సెంటర్ ఇంజినీరింగ్, ఆన్‌సైట్ సపోర్ట్ టెక్నీషియన్‌ ఉద్యోగులు వారానికి నాలుగైదు రోజులు ఆఫీసుకు రావాలని పేర్కొంది. ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రతి వారం మూడు రోజులు కార్యాలయానికి రావాలని తెలిపింది. ఒకవేళ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. అలాంటి వారిపై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ముఖాముఖి చర్చలు, టీమ్ వర్క్ ను పెంపొందించడం కోసం ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.