
Narayana Murthy: డివిడెండ్ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తలలో నిలిచారు.
ఆయన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి సంస్థ నుంచి డివిడెండ్ రూపంలో రూ.3.3 కోట్లు లభించనున్న నేపథ్యంలో ఇది సంచలనంగా మారింది.
వయసు కేవలం 17 నెలలే అయినా, ఈ బాలుడు ఇప్పటికే కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
ఇన్ఫోసిస్ సంస్థ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ ప్రకటించింది.
ఒక్కో షేరుకు రూ.22 చెల్లించేందుకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ ప్రకటనతో నారాయణమూర్తి మనవడు ఏకాగ్రహ్ కు షేర్లపై డివిడెండ్‌గా రూ.3.3 కోట్లు లభించనున్నాయి.
ఒక చిన్న వయస్సులోనే అంత పెద్ద మొత్తాన్ని పొందడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాలు
ఇన్ఫోసిస్ మొత్తం ఈక్విటీలో 0.04 శాతం వాటా
ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణమూర్తి ఆయనకు భారీ విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు.
అప్పటి విలువ ప్రకారం రూ.240 కోట్ల మోతాదులోని షేర్లను (సుమారు 15 లక్షల షేర్లు) ఆయన మనవడికి గిఫ్ట్ చేశారు.
ఇది ఇన్ఫోసిస్ మొత్తం ఈక్విటీలో 0.04 శాతం వాటాగా ఉంటుంది.
తాత నుండి లభించిన ఈ బహుమతితో ఏకాగ్రహ్ ఒక యంగ్ మిలియనీర్‌గా మారిపోయాడు.
గత ఏడాది ఆయనే షేర్ల ద్వారా డివిడెండ్‌గా రూ.7.35 కోట్లు అందుకున్నారు.
తాజాగా ప్రకటించిన డివిడెండ్ ప్రకారం ఈ ఏడాది ఆయనకు రూ.3.3 కోట్లు లభించనున్నాయి. దీనితో ఇప్పటి వరకు ఈ షేర్ల ద్వారా ఏకాగ్రహ్ సంపాదించిన మొత్తం రూ.10.65 కోట్లకు చేరింది.
వివరాలు
రోహన్ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు మూడవ మనవడు
ఏకాగ్రహ్ 2023 నవంబరులో రోహన్ మూర్తి, అపర్ణామూర్తి దంపతులకు జన్మించాడు.
నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు ఇది మూడవ మనవడు.
ఇక అక్షతా మూర్తి - బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఇద్దరు కుమార్తెలకు కూడా నారాయణమూర్తి-సుధామూర్తి గారే తాతయ్య తాతయ్యలు కావడం విశేషం.