రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు. హేస్టింగ్స్ దీర్ఘకాల సహచరులు గ్రెగ్ పీటర్స్, టెడ్ సరండోస్ నెట్‌ఫ్లిక్స్ కో-సిఈఓలుగా ఎంపికయ్యారు. 2022లో నెట్‌ఫ్లిక్స్అధిక సంఖ్యలో చందాదారులను కోల్పోయింది. దాని పోటీదారుల నుండి ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అయితే, సంవత్సరం ద్వితీయార్థంలో మళ్ళీ పుంజుకుంది. 2020లో సరండోస్ సహ సిఈఓగా పదోన్నతి పొందగా, పీటర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. గత 2½ సంవత్సరాలలో నెట్‌ఫ్లిక్స్ నిర్వహణను వారికే ఎక్కువగా అప్పగించానని హేస్టింగ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత త్రైమాసిక విజయానికి కారణం కొత్త కంటెంట్
2022 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 7.66 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు పెరగడంతో నెట్‌ఫ్లిక్స్ నిర్వహణలో మార్పు వచ్చింది, ఇది వాల్ స్ట్రీట్ 4.57 మిలియన్ల అంచనాను అధిగమించింది. గత త్రైమాసిక విజయానికి "Wednesday", "Harry & Meghan" వంటి కొత్త కంటెంట్ కారణమని కంపెనీ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 231 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. అయితే, దాని ప్రతి షేరు ఆదాయాలు విశ్లేషకుల అంచనాల 45 సెంట్లు అయితే, కేవలం 12 సెంట్లు వచ్చాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ $7.85 బిలియన్ల ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉంది.