UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన యూపీఐ లైట్ సేవల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సేవలను మరింత మెరుగుపరచేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు అందుబాటులో లేని బ్యాలెన్స్ 'విత్‌డ్రా' ఆప్షన్‌ను యూపీఐ లైట్‌లో తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. యూపీఐ లైట్ ద్వారా ఎలాంటి పిన్ అవసరం లేకుండా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇది 'వన్ వే' సేవ మాత్రమే.
అంటే, ఖాతాలోకి నిధులు జమ చేసేందుకు మాత్రమే వీలుండేది కానీ, డబ్బును ఉపసంహరించుకునే సదుపాయం ఉండదు.
ప్రస్తుతం ఆ ఖాతాలో డబ్బును వెనక్కి తీసుకోవాలంటే యూపీఐ లైట్ సేవను నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదు.
Details
మార్చి 31 నాటికి అందుబాటులోకి
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్‌పీసీఐ కొత్తగా 'ట్రాన్స్‌ఫర్ అవుట్' ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
త్వరలోనే నగదు ఉపసంహరణకు వీలు కల్పించనుంది. మార్చి 31 నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావొచ్చని సమాచారం.
ఇందుకోసం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ ఇప్పటికే అధికారిక లేఖ రాసింది.