
UPI: యూపీఐలో కొత్త పరిమితులు.. ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షల గరిష్ఠ పరిమితి!
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ లావాదేవీల పరిమితుల్లో మార్పులు చేసింది. బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్లు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి విభాగాల్లో యూపీఐ ద్వారా చేసే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పరిమితులు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అదే తేదీ నుంచి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితి కూడా వేర్వేరు విభాగాల్లో రూ.10 లక్షల వరకు పెంచారు.
Details
వెరిఫైడ్ మర్చంట్లుగా గుర్తింపు పొందిన వ్యాపారులకే వర్తింపు
ఎన్‌పీసీఐ ప్రకటన ప్రకారం, సవరించిన ఈ పరిమితులు అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్, ట్రావెల్, బిజినెస్/మర్చంట్ లావాదేవీలకు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు వర్తించనున్నాయి. కొత్త పరిమితులు కేవలం వెరిఫైడ్ మర్చంట్లుగా గుర్తింపు పొందిన వ్యాపారులకే వర్తిస్తాయి. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. సాధారణ యూపీఐ లావాదేవీలకు గరిష్ఠ పరిమితి రోజుకు రూ.1 లక్షగానే కొనసాగుతుంది.