
Fastag New Rules: ఫాస్టాగ్ చెల్లింపుల్లో నూతన నిబంధనలు.. నవంబర్ 15 నుంచి అమల్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ వార్షిక పాస్‌ను కేవలం రూ.3,000 చెల్లించి కొనుగోలు చేస్తే, ఏడాదంతా లేదా 200 ట్రిప్పులు జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్‌ప్రెస్ వీల్స్‌పై ప్రయాణించవచ్చు. ఈ యాన్యువల్ పాస్‌ల రిజిస్ట్రేషన్ ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమైంది. వాహనదారుల నుంచి దీని పట్ల భారీ స్పందన వచ్చింది. ఇక సౌకర్యాలను మరింత పెంచేందుకు కేంద్రం రెండు కొత్త నియమాలను అమలు చేస్తోంది. ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల టోల్‌గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతలు చెల్లించాల్సి ఉండేది.
Details
ఉచితంగా గేట్ దాటే అవకాశం
కొత్త నిబంధన ప్రకారం, నగదు ద్వారా టోల్ చెల్లిస్తే ఇదే విధంగా రెండు రెట్లు ఉండటం కొనసాగుతుంది. కానీ యూపీఐ ద్వారా చెల్లిస్తే, టోల్ మొత్తం 1.25 రెట్లు చెల్లించడం మాత్రమే కావాలి. ఉదాహరణకు, ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు రూ.100చెల్లిస్తే, ఫాస్టాగ్ లేకుండా నగదు చెల్లిస్తే రూ.200, కానీ యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.125 మాత్రమే చెల్లించాలి. అదేవిధంగా ఫాస్టాగ్ సక్రమంగా పనిచేస్తున్నా టోల్ వసూలు వ్యవస్థలో లోపం వచ్చినప్పుడు వాహనదారులు ఉచితంగా గేట్ దాటవచ్చు. ఈ విధంగా ఆ సమయంలో ఎలాంటి నగదు లేదా యూపీఐ చెల్లింపు అవసరం ఉండదు. ఈ రెండు కొత్త నియమాలు వచ్చే నెల 15, నవంబర్ 15, 2025 నుండి అమలులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.