
May New Rules: మే 1 నుంచి కొత్త నిబంధనలు.. ఏటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ వరకు భారమే భారం!
ఈ వార్తాకథనం ఏంటి
మే 1, 2025 నుంచి వినియోగదారుల దైనందిన లావాదేవీలపై గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఈ మార్పులు ఏటీఎం విత్‌డ్రాయిలు, రైల్వే టికెట్ బుకింగ్, బ్యాంకింగ్ సేవలు, వంట గ్యాస్ ధరలు, FD, పొదుపు ఖాతా వడ్డీ రేట్ల వరకు వ్యాప్తి చెందాయి.
ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
అందువల్ల ముందుగానే వివరంగా తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు ఈ మార్పులను ఓసారి పరిశీలిద్దాం:
Details
1. ఏటీఎం నుంచి డబ్బుల విత్‌డ్రా ఖరీదైనదైపోతోంది
మే 1 నుంచి ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితి రద్దుకాబోతుంది. ఇప్పుడు ప్రతీసారి ఏటీఎం విత్‌డ్రాయ్ చేస్తే రూ.19 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో ఇది రూ.17గా ఉండేది. అలాగే బ్యాలెన్స్ చెక్ చేసినా ఇప్పుడు రూ.7 రుసుము కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా గతంలో రూ.6 మాత్రమే ఉండేది.
2. రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
మే 1 నుండి కొత్త రైల్వే టికెట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. ఇకపై వెయిటింగ్ టిక్కెట్లు జనరల్ కోచ్‌లకే పరిమితమవుతాయి.
స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణించలేరు. ప్రయాణికులు ఈ కొత్త మార్పును దృష్టిలో ఉంచుకుని తమ టిక్కెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
Details
3. 'వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బి' పథకం అమలు
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో వన్ స్టేట్ వన్ RRB పథకం మే 1 నుంచి ప్రారంభమవుతోంది.
ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒకే పెద్ద బ్యాంకుగా విలీనమవుతాయి.
ఇది ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో అమలవుతుంది. దీని వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి.
4. ఎల్‌పిజి సిలిండర్ ధర సమీక్ష
ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరను సమీక్షించడం ఆనవాయితీ. మే 1న కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. ధరల పెరుగుదల వల్ల గ్యాస్ వినియోగదారులపై ప్రత్యక్ష ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
Details
5. FD, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు
RBI ఇటీవల రెపో రేటును రెండు సార్లు తగ్గించడంతో బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లు తగ్గించాయి.
మే 1 నుండి FD సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లలో మరిన్ని మార్పులు రావొచ్చు.
దీని ప్రభావం పొదుపు దారుల ఆదాయంపై పడనుంది. ఈ మార్పులన్నీ మీ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, ముందుగా అవగాహన కలిగి ఉండటం అనివార్యం.