
Stock Market :స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్లు మళ్లీ లాభాల దిశగా పయనించాయి.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో పాటు, దేశవాళీ స్థాయిలో కీలక రంగాల్లో కొనుగోళ్ల ఊపు కనిపించడంతో సూచీలు మద్దతు పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో, దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడుతూ మళ్లీ 80,000 పాయింట్ల మైలురాయిని దాటి ముందుకు సాగింది. నిఫ్టీ కూడా 24,300 మార్క్ పైన కొనసాగుతోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో,సెన్సెక్స్ 268.57 పాయింట్లు పెరిగి 80,070 వద్ద ట్రేడవుతోంది.
అదే సమయంలో నిఫ్టీ 90.35పాయింట్లు లాభపడి 24,337.05వద్ద కొనసాగుతోంది.
అంతేకాకుండా, రూపాయి మారకం విలువలో కూడా బలపడటం కనిపించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువు 18 పైసలు పెరిగి 85.5కి చేరుకుంది.
వివరాలు
వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసిన వాల్ స్ట్రీట్ మార్కెట్లు
నిఫ్టీలో ప్రధానంగా కొన్ని కంపెనీల షేర్లు బాగా రాణిస్తున్నాయి.అందులో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్,అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు ముందంజలో ఉన్నాయి.
అయితే మరోవైపు, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జ్యూమర్ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా శుక్రవారం లాభాలతోనే కొనసాగుతున్నాయి.
జపాన్ నిక్కీ సూచీ 0.91 శాతం, దక్షిణ కొరియాలో కోస్పి సూచీ 1.03 శాతం, హాంకాంగ్‌లో హాంగ్‌సెంగ్ సూచీ 0.75 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇంకా, అమెరికాలోని వాల్ స్ట్రీట్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.
గురువారం నాటి ట్రేడింగ్‌లో ఎస్‌అండ్‌పీ సూచీ 2.03 శాతం, నాస్‌డాక్ 2.74 శాతం, డోజోన్స్ 1.23 శాతం లాభపడాయి.