Page Loader
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,200 ఎగువన నిఫ్టీ
ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,200 ఎగువన నిఫ్టీ

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,200 ఎగువన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ప్రస్తుతం త్రైమాసిక ఫలితాల కాలం నడుస్తుండటంతో పాటు,భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందం గురించి ఇంకా స్పష్టత అందకపోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ,రోజంతా మోస్తరుగా కదలాడి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 82,534.66 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో (మునుపటి ముగింపు 82,570.91)ప్రారంభమైంది. ఉదయం సమయంలో ఇది ఎక్కువగా నష్టాల బాటలోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కొన్ని లాభాలను నమోదు చేయడం ప్రారంభించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,784.75పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన ఈ సూచీ, చివరికి 63 పాయింట్ల లాభంతో 82,634.48 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.50 డాలర్లు 

నిఫ్టీ కూడా 16.25 పాయింట్ల లాభంతో 25,212.05 వద్ద స్థిరంగా ముగిసింది. అంతేగాక, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.94గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్ లాభపడిన ప్రధాన షేర్లుగా నిలిచాయి. అయితే, ఎటర్నల్‌, సన్ ఫార్మా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బీ.ఇ.ఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ఔన్సు ధర 3,347 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.