Page Loader
Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు కొంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లాట్‌గా ఉండగా, కొద్ది సమయం తర్వాత లాభాల్లోకి మళ్లాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 91 పాయింట్ల పెరుగుదలతో 77,782 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 23,587 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద ఉంది.

వివరాలు 

సెన్సెక్స్‌ 30 (SENSEX)

సెన్సెక్స్‌ 30లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.02 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,567 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా ఇదే ధోరణి

అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమ ముగింపును చూశాయి, అలాగే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా ఇదే ధోరణిని పాటిస్తున్నాయి. ఆసియా మార్కెట్‌లో ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.26శాతం, జపాన్‌ నిక్కీ 0.10శాతం లాభాల్లో ఉండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.69శాతం, షాంఘై 0.28శాతం నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం రూ.2,503 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.6,145 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

వివరాలు 

స్విగ్గీ షేర్లు 6శాతం లాభంతో ప్రారంభం

నిన్న దలాల్‌ స్ట్రీట్‌లో లిస్ట్‌ అయిన స్విగ్గీ షేర్లు రెండో రోజు కూడా మంచి లాభాలతో కొనసాగాయి. ఇవి మార్కెట్‌ ప్రారంభంలోనే 6 శాతం లాభంతో రూ.471 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇష్యూ ధర రూ.390 కాగా, నిన్న మార్కెట్‌లో రూ.420 వద్ద లిస్ట్‌ అయ్యాయి. మొదటి రోజు ముగింపులో ఏకంగా 16.92శాతం లాభంతో రూ.456 వద్ద ముగిశాయి.