
Stock market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,075
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, అమెరికా-భారత్ వాణిజ్య చర్చల ఫలితాల కోసం మదుపర్లు వేచి చూస్తున్నారు. దీంతో పాటు, విదేశీ పెట్టుబడులు మన మార్కెట్ల నుంచి వెనక్కు వెళ్లిపోతుండటం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నిన్నటి నష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 82,090 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు తగ్గి 25,075 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.99 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
వివరాలు
నిన్న లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు
అయితే యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. ఇదిలా ఉండగా, నేటి ట్రేడింగ్‌లో జపాన్ నిక్కీ సూచీ నష్టాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్ మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేస్తూ కదలాడుతున్నాయి.