
Noel Tata: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా
ఈ వార్తాకథనం ఏంటి
టాటా ట్రస్ట్ ల ఛైర్మన్‌గా నోయల్ టాటా నియమితులయ్యారు. ఆయన రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు.
నోయల్ ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయన ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ టాటా కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.
అలాగే, టాటా స్టీల్, టైటాన్‌కు వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు.
వివరాలు
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు అత్యధికంగా 66% వాటా
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు అత్యధికంగా 66% వాటా ఉంది.
ఈ కారణంగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి, గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు.
ఇప్పటివరకు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా ఉన్నారు. ఆయన మరణంతో, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ పదవి ఖాళీ అయ్యింది.
ఇప్పుడు ఈ బాధ్యతలను నోయల్ టాటాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి విషయంలో మొదట వేర్వేరు పేర్లు వినిపించినప్పటికీ, నొయల్ టాటాకు పగ్గాలు అప్పగించడం విశేషం.