Page Loader
Akash Ambani: పని గంటలు కాదు, పనితీరు ముఖ్యం.. ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు!
పని గంటలు కాదు, పనితీరు ముఖ్యం.. ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు!

Akash Ambani: పని గంటలు కాదు, పనితీరు ముఖ్యం.. ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల పని గంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే, దేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక తాజాగా ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ కూడా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పడం పెద్ద విమర్శలకు తావిచ్చింది. క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్ది మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు రోజుకు 9.30 గంటల చొప్పున, వారానికి ఐదు రోజుల పని చేయడం సరిపోతుందని ఆయన వెల్లడించారు.

Details

ప్రాధాన్యతలను ఆర్థం చేసుకోవాలి

అంతేకాకుండా, వీకెండ్స్‌లో ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపవద్దని కంపెనీలకు సూచించారు. నాలుగేళ్లుగా తాను ఇదే విధానాన్ని అనుసరిస్తున్నానని తెలిపారు. తాజాగా రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ కూడా ఉద్యోగుల పని గంటల అంశంపై స్పందించారు. ముంబయి టెక్ వీక్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, "ఒక ఉద్యోగి ఆఫీసులో గడిపే గంటలను తాను లెక్కించనని, పనిలో నాణ్యతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తన జీవితంలో పని, కుటుంబం అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ తమ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.