IPO: నేడే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ చివరి రోజు.. ఈ షేర్ల GMP ఎలా ఉందొ చూద్దామా..
స్టాక్ మార్కెట్‌లో మరో భారీ ఐపీఓ ప్రవేశించింది. NTPC లిమిటెడ్‌కు అనుబంధంగా ఉండే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) ఐపీఓ నవంబర్ 19న ప్రారంభమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 10,000 కోట్ల నిధులను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్వెస్టర్లు నవంబర్ 19 నుంచి నవంబర్ 22 వరకు ఈ ఐపీఓలో బిడ్స్ వేయగలుగుతారు. అంటే ఈ రోజు (నవంబర్ 22) ఈ ఐపీఓకు చివరి తేదీ. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరు ధర బ్యాండ్‌ను రూ.102 నుంచి రూ.108 మధ్యగా నిర్ణయించారు. లాట్ సైజ్ 138 ఈక్విటీ షేర్లుగా ఉంటుంది.షేర్ల కేటాయింపు నవంబర్ 25న జరుగగా, నవంబర్ 27న ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది.
బిడ్డింగ్ వివరాలు
ఈ రోజు ఉదయం 10:31 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఐపీఓలో మొత్తం 56,01,58,217 షేర్లకు బదులుగా 58,12,19,292 షేర్లకు బిడ్డింగ్‌లు వచ్చాయి, అంటే 1.04 రెట్లు సబ్‌స్క్రిప్షన్ జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లు 2.72 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేస్తే, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIలు) 0.40 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు (QIBలు) 0.79 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేశారు. ఈ ఐపీఓ బిడ్డింగ్ నేటి సాయంత్రం 5:00 గంటలకు ముగియనుంది.
గ్రే మార్కెట్‌లో పరిస్థితి
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఒక్కొక్కటి రూ. 108 వద్ద ట్రేడవుతున్నాయి, ఇది ఐపీఓలో నిర్ణయించిన గరిష్ఠ ధరే. అందువల్ల, ఈ ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత 20 రోజుల్లో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) గణనీయంగా తగ్గింది. GMP అనేది మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తుంది, ఇది తరచూ మారుతూ ఉంటుంది.