Ola Showroom: విశాఖలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి కస్టమర్ నిరసన
రూ.1,20,000 పెట్టి ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొన్న ఓ కస్టమర్, రెండు నెలల్లో ఆరుగురు సార్లు బైక్ ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా వినియోగదారు ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ఆయన బైక్‌ను తీసుకున్న తర్వాత ఇంట్లో ఆడవాళ్లు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కస్టమర్ మాట్లాడుతూ, తన బైక్ ఆరు సార్లు ఆగిపోవడంతో షోరూమ్‌కు వెళ్లి సర్వీసింగ్ చేయించడానికి ప్రయత్నించానని అక్కడ కూడా సరైన సేవలు లభించలేదని వాపోయారు.
సక్రమంగా సర్వీసింగ్ చేయడం లేదు
తాము లక్షా ఇరవై వేల రూపాయలు పెట్టి ఈ బైక్ కొన్నామని, కానీ వాడుకలో వస్తున్న సమస్యలను సరిచేయడం కంటే తమల్ని బెదిరించడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి బండి కొంటే చాలాసార్లు అగిపోయిందని, ముఖ్యంగా సరైన సర్వీసింగ్ కూడా చేయడం లేదని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.