Page Loader
Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు 
Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు

Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు 

వ్రాసిన వారు Stalin
Feb 06, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై(PPBL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు స్టార్టప్‌లు వ్యవస్థాపకులు కేంద్రానికి లేఖ రాశారు. ఆంక్షలను ఆర్‌బీఐ వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే, ఫిన్‌టెక్‌ రంగంపై సమాజంలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పీఎంఓకు రాసిన లేఖలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐకి కూడా ఆ లేఖను పంపించారు. ఇన్నోవ్‌8, భారత్‌ మ్యాట్రిమోనీ, క్యాపిటల్‌మైండ్‌తో పాటు మరికొన్ని స్టార్టప్‌లు లేఖ రాసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. PPBLపై విధించిన ఆంక్షలు ఆందోళనకు గురి చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పేటీఎం

ఆ వార్తలను ఖండించిన జియో ఫైనాన్షియల్‌ 

ఆర్‌బీఐ చర్యలను స్టార్టప్‌లు వ్యవస్థాపకులు అత్యంత కఠినమైనవిగా అభివర్ణించారు. ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయకపోయినా.. వాటి తీవ్రతను తగ్గించే అంశంపైనా అయినా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. పేటీఎంతో ఆర్ బీఐ చర్చలు జరిపి.. లోపాలను సవరించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే, పేటీఎం వాలెట్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్న వస్తున్న వార్తల్ని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఖండించింది. ఇదే విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు జియో ఫైనాన్షియల్‌ సమాచారమిచ్చింది. ఏదైనా ఉంటే, తామే అన్ని విషయాలను వెల్లడిస్తామని కంపెనీ వివరించింది.