Paytm షేర్లు మళ్ళీ ఢమాల్.. 3 సెషన్లలో 42% తగ్గిన షేర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో సోమవారం కూడా పేటియం కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.కేవలం మూడు సెషన్లలో 42% పైగా పడిపోయింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు గత వారం రూ.761.4 ఉండగా సోమవారం ఉదయం నాటికి కంపెనీ షేరు 10 శాతం నష్టంతో రూ.438.50 వద్ద లోయర్ సర్య్యూట్‌ను తాకింది. ఫిబ్రవరి 29 తర్వాత Paytmపేమెంట్స్ బ్యాంక్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా,క్రెడిట్ లావాదేవీలను నిర్వహించకుండా RBI నిషేధించింది. ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో బ్రోకరేజీలు పేటీఎం స్టాక్ రేటింగ్స్,టార్గెట్ ధరలను భారీగా తగ్గించాయి. తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని పేటీఎం యాజమాన్యం తెలిపింది. ఆర్ బి ఐ ఆంక్షల నేపథ్యంలో ఎటువంటి తొలగింపులు ఉండవని శర్మ పేర్కొన్నారు.