IRCTC Super APP: డిసెంబర్ చివరి నాటికి భారతీయ రైల్వే సూపర్ యాప్.. అన్ని అవసరాలకు ఒకే యాప్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిరోజు భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
సుదూర ప్రయాణాల కోసం రైలులో టికెట్ బుక్ చేసుకోవడం అనివార్యం. అందుకు ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది.
అయితే, రైలు లైవ్ లొకేషన్‌ను తెలుసుకోవడం, ఇతర సేవలను పొందడం కోసం వివిధ యాప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది.
ఈ సమస్యలను పరిష్కరించడానికి ఐఆర్‌సీటీసీ కొత్త సూపర్ యాప్‌ను త్వరలో విడుదల చేయబోతోంది.
ఈ సూపర్ యాప్‌లో అన్ని రకాల రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. రైల్వే శాఖకు సంబంధించి టిక్కెట్ల బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్,ట్రాకింగ్ వంటి అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా నిర్వహించవచ్చు.
వివరాలు
డిసెంబర్ నెలాఖరులో అందుబాటులోకి..
అదేవిధంగా, ప్రయాణికులు రైలులో ఉన్నప్పుడు ఆహారం ఆర్డర్ చేయడానికి కూడా ఈ యాప్ అనుకూలంగా ఉంటుంది.
ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, సాధారణ ప్రవేశ టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ సూపర్ యాప్ డిసెంబర్ నెలాఖరులో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం, 10 కోట్లకు పైగా ప్రజలు ఐఆర్‌సీటీసీ రైల్వే కనెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నారు, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా ఉంది.
కేవలం IRCTC మాత్రమే కాదు, Rail Madad, UTS, Satark, TMC-Direction, IRCTC Air, Portread వంటి అనేక యాప్‌లు కూడా రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
ఈ సేవలన్నింటినీ ఒకే సూపర్ యాప్ ద్వారా అందించడానికి భారతీయ రైల్వే సిద్ధమవుతోంది.