LOADING...
టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 15, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టమాట కిలో రూ.150 నుంచి 250 వరకు ధర పలుకుతుండగా సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఉల్లిగడ్డ ధరలు కూడా పెరిగితే సామాన్యులు మరింత ఇబ్బందిని ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నైరుతి రుతుపవనాల వల్ల ఉత్తర భారతంలో భారీ వర్షాలు, దక్షిణాదిన వానలు లేని పరిస్థితి నెలకొంది. దీంతో ధరల్లో మార్పులు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎర్ర ఉల్లిగడ్డ కిలోకి రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. జులై చివరి వారం నుంచి, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చేవరకు ఉల్లిధరలు ఆకాశాన్ని తాకొచ్చని విశ్లేషకుల అంచనా

DETAILS

కిలో ఉల్లి ధర రూ.100కుపైనే

దిగమతి వ్యత్యాసం వల్ల కిలో ఉల్లిగడ్డ ధర రూ.100పైనే ఉండే అవకాశం ఉందని నేషనల్‌ కమోడిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ సీఈవో సంజయ్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ నిల్వలు ఉన్నాయని సంజయ్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుతం అందులో నుంచే ఉల్లిని వాడుతున్నామన్నారు. తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్‌, నవంబర్‌ లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌‌తో కలిసి ఇప్పటివరకు దాదాపు 2.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని సేకరించినట్లు సమాచారం. మరో 2వారాల్లో ఉల్లి సేకరణ ప్రక్రియ పూర్తి కానుండగా, ఈసారి సేకరణ తగ్గవచ్చనే అభిప్రాయం నెలకొంది. అలాంటి పరిస్థితి తలెత్తితే ఉల్లి ధరల పెరగడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.