LOADING...
OpenAI: సెప్టెంబరులో ఓపెన్‌ఏఐ ఐపీఓ..? టెక్ ప్రపంచంలో భారీ చర్చ
సెప్టెంబరులో ఓపెన్‌ఏఐ ఐపీఓ..? టెక్ ప్రపంచంలో భారీ చర్చ

OpenAI: సెప్టెంబరులో ఓపెన్‌ఏఐ ఐపీఓ..? టెక్ ప్రపంచంలో భారీ చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెన్‌ఏఐ సంస్థ త్వరలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఓపెన్‌ఏఐ సంస్థ ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందుకోసం గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో కలిసి అవసరమైన పత్రాల తయారీలో నిమగ్నమైంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఏడాది సెప్టెంబరులోనే ఐపీఓ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

వివరాలు 

మార్కెట్‌లోకి రావడానికి ఆంత్రోపిక్ సంస్థ ప్రయత్నాలు

ప్రస్తుతం ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓల్లో ఓపెన్‌ఏఐ ఒకటిగా మారింది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ కూడా త్వరలో పబ్లిక్ ఇష్యూ దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఓపెన్‌ఏఐకు పోటీగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ కూడా మార్కెట్‌లోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ ఈ ఏడాది జరిగిన ఫండింగ్ రౌండ్ తర్వాత ప్రైవేట్ మార్కెట్‌లో దాదాపు 852 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. ఐపీఓ విజయవంతమైతే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలకు మరింత సంపద చేరే అవకాశముంది.

వివరాలు 

ఏడాది ప్రారంభంలోనే 122 బిలియన్ డాలర్ల భారీ ఫండింగ్

సామ్ ఆల్ట్‌మాన్‌ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ సంస్థ కనీసం 60 బిలియన్ డాలర్లు సమీకరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ 122 బిలియన్ డాలర్ల భారీ ఫండింగ్ సాధించింది. గూగుల్, ఆంథ్రోపిక్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా వారానికి 900 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Advertisement