Page Loader
Credit card: క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా? తప్పక పాటించవలసిన నియమాలివే!
క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా? తప్పక పాటించవలసిన నియమాలివే!

Credit card: క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా? తప్పక పాటించవలసిన నియమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

షాపింగ్‌, డైనింగ్‌, బిల్లుల చెల్లింపులు వంటి వాటికి చాలా మంది క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. తాజాగా అద్దె చెల్లింపులకూ క్రెడిట్‌ కార్డుల వినియోగం విస్తరిస్తోంది. నగదు కొరత ఉన్నపుడు ఈ ఆప్షన్‌ ద్వారా వేరే ఖాతాకు నగదు బదిలీ చేసి, అక్కడి నుంచి డబ్బు పొందడం సాధ్యమవుతోంది. కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బు ఉన్నా, క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ పేమెంట్‌ చేసే అలవాటు కూడా ఉంటుంది. ఇది లాభమా, నష్టమా? పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్‌, నో బ్రోకర్‌, రెడ్‌ జిరాఫీ, ఫ్రీఛార్జ్‌ వంటి సంస్థలు రెంట్‌ పేమెంట్‌ సేవలందిస్తున్నాయి. ఇవి ఇంటి యజమాని అద్దెదారుని మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి. ఈ సేవలకు 1-3 శాతం వరకు లావాదేవీ రుసుము వసూలు చేస్తారు.

Details

 క్రెడిట్‌ కార్డుతో రెంట్‌ చెల్లింపుల ప్రయోజనాలు 

1. రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు క్రెడిట్‌ కార్డుల ద్వారా రెంట్‌ చెల్లించడంలో క్యాష్‌బ్యాక్‌లు, ట్రావెల్‌ పాయింట్లు, రివార్డులు లభిస్తాయి. ఇవి కార్డు పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. 2. చెల్లింపు గడువు రెంట్‌ చెల్లింపుల తర్వాత బిల్లు చెల్లించడానికి 20-45 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో నగదును ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. 3. క్రెడిట్‌ స్కోరు మెరుగుదల క్రమం తప్పకుండా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా మంచి క్రెడిట్‌ స్కోరు పొందవచ్చు. 4. నగదు కొరతతో ఉపశమనం ఆర్థిక ఇబ్బందుల్లోనూ యజమానికి అద్దె చెల్లింపులు సకాలంలో పూర్తి చేయడానికి ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది.

Details

 నష్టాలు, జాగ్రత్తలు 

1. ఫీజులు, రుసుములు థర్డ్‌ పార్టీ యాప్‌లు మరియు కొన్ని బ్యాంకులు రెంట్‌ పేమెంట్లపై 1-3 శాతం ఫీజు వసూలు చేస్తాయి. 2. వడ్డీ భారం రెంట్‌ చెల్లించిన తర్వాత బిల్లు సకాలంలో చెల్లించకపోతే 30-42 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 3. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రిషియో రెంట్‌ చెల్లింపులు ఎక్కువగా ఉంటే, క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రిషియో 30 శాతాన్ని మించి క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 4. ఆర్థిక క్రమశిక్షణ లోపం క్రెడిట్‌ కార్డు ఆధారంగా డబ్బును అవసరాలకన్నా ఇతరుల కోసం వినియోగించి ఆర్థిక నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉంది. క్రెడిట్‌ కార్డుతో రెంట్‌ చెల్లింపు చేసే ముందు రివార్డులు, ఫీజులను సరిచూసుకోవాలి.