
Insurance-Man Died in Terror Attack:ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి బీమా లభిస్తుందా?..ఎంత వస్తుంది..దానికి సంభందించిన రూల్స్ ఏంటి ?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ సంక్షోభాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎదుర్కొంటున్నారు.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. ఇదే తరహాలో 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడిలో సుమారు 166 మంది అమాయకులు బలయ్యారు.
ఈ ఘటనల తరువాత కూడా దేశంలో అనేక చోట్ల ఉగ్రదాడులు ఆగలేదు.
ఈ నేపథ్యంలో ఉగ్రదాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలు జీవిత బీమా క్లెయిమ్ చేసుకోగలవా? అనే సందేహం చాలా మందిలో ఏర్పడుతోంది.
వివరాలు
ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి బీమా వర్తిస్తుందా?
ఇన్సూరెన్స్ రంగంలో గత కొన్ని సంవత్సరాల్లో ఎనలేని మార్పులు చోటు చేసుకున్నాయి.
జీవిత బీమా పాలసీలలో ఇప్పుడు ఉగ్రదాడులు వల్ల సంభవించే మరణాలను కూడా కవర్ చేస్తున్నారు.
అంటే, ఉగ్రవాద దాడిలో మరణించినవారి కుటుంబాలకు బీమా ప్రయోజనం అందుతుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) ప్రకారం, ఇప్పుడు జీవిత బీమా పాలసీలు ఉగ్రవాద దాడులను కూడా పరిధిలోకి తీసుకుంటున్నాయి.
అందువల్ల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారు సాధారణ బీమా క్లెయిమ్ పరిధిలోకి వస్తారు.
వివరాలు
అదనపు బీమా వర్తిస్తుందా?
కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ పాలసీదారు ప్రమాదకర పరిస్థితుల్లో మరణిస్తే అదనపు రక్షణ ఇచ్చే బీమా మొత్తాన్ని ఉగ్రదాడుల సందర్భంలో వర్తించవచ్చు అన్న గ్యారంటీ లేదు.
ఉదాహరణకు, ఎవరికైనా రూ. 50 లక్షల జీవిత బీమా ఉంటే, అలాగే ప్రమాద మరణానికి అదనంగా రూ. 10 లక్షల కవర్ కూడా తీసుకున్నా, వారు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి రూ. 50 లక్షల పాలసీ మొత్తమే లభిస్తుంది. అదనపు రూ. 10 లక్షల కవర్ ఈ సందర్భంలో వర్తించదు.
వివరాలు
ఇల్లు, వాహనాలకూ రక్షణ
జీవిత బీమా మాత్రమే కాదు, చాల బీమా కంపెనీలు ఇల్లు, వాహనాలకూ ఉగ్రదాడుల కారణంగా కలిగే నష్టాలకు రక్షణ కల్పిస్తున్నాయి.
ఉగ్రదాడుల వల్ల ఇళ్ళు పూర్తిగా ధ్వంసమవ్వడం, వాహనాలు పూర్తిగా కాలిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
మీరు మీ ఇంటికి లేదా కారుకు బీమా తీసుకుని ఉంటే, దానికి సంభంధించిన నష్టం వస్తే బీమా క్లెయిమ్ ద్వారా ఆ మొత్తాన్ని పొందవచ్చు.
ఈ నేపథ్యంలో, ప్రజలు ఆరోగ్య బీమా, ఆస్తి బీమాలపై కూడా దృష్టి పెట్టడం మంచిది.
వివరాలు
బీమా క్లెయిమ్‌కు అవసరమైన డాక్యుమెంట్లు
బీమా క్లెయిమ్ ప్రక్రియలో ముఖ్యంగా అవసరమయ్యే పత్రాలు.. పోలీస్ రిపోర్ట్,మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్).
ఉగ్రవాద దాడుల్లో మరణించినవారికి సంబంధించి బీమా క్లెయిమ్ ప్రక్రియ చాలా సులువు.
ఎందుకంటే ప్రభుత్వ విభాగాల వద్ద ఉగ్రదాడిలో మృతి చెందిన వారి లిస్ట్ అందుబాటులో ఉంటుంది.
అందువల్ల ప్రభుత్వం లేదా మునిసిపాలిటీల ద్వారా ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ఆధారంగా బీమా క్లెయిమ్ మంజూరు చేయడం సులభమవుతుంది.
అయితే ఇతర కారణాల వల్ల మరణించిన సందర్భాల్లో పూర్తి దర్యాప్తు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.