
ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
ల్యాప్‌టాప్‌ల, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులను పర్యవేక్షించడానికి భారత్ 'ఇంపొర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం' పేరుతో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌ల దిగుమతికి ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. ఉచిత దిగుమతులను ఆపలేదని ఐటీ సక్రటరీ ఎస్ కృష్ణన్ సీఎన్‌బీసీ పేర్కొన్నారు.
ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తియైన తర్వాత దిగుమతిదారులకు దిగుమతి చేసుకోవడానికి ఆటోమేటిక్‌గా అనుమతి లభిస్తుందని చెప్పారు.
ఇందులో ఎలాంటి పరిమితి లేదని, డేటాను సేకరించడానికి మాత్రమే దిగుమతి నిర్వహణ వ్యవస్థను ప్రారంభించామన్నారు.
అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Details
నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త ప్రతిపాదన
ఇకపై దిగుమతిదారులు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇంపోర్ట్ ఆథరైజేషన్ కోరవలసి ఉంటుందని, ఇది ఎండ్-టు-ఎండ్ ఆన్ లైన్ ఫార్మాట్లో జారీ చేస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇందులో దిగుమతి చేసుకునే పరిమాణం, వాటి విలువను తెలియాల్సి ఉంటుందని అవి కూడా సెప్టెంబర్ 30, 2024నాటికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నారు.
కొత్తగా ప్రతిపాదించబడిన ఈ దిగుమతి నిర్వహణ ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
దిగుమతిదారుల సమస్యల పరిష్కారం, సందేహాలను తెలుసుకోవడానికి ప్రతి మంగళవారం ఉదయం 10:30గంటలకు DGFT ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.