Page Loader
రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం 

రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

రెపో రేటును యథాతథంగా 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు మారకపోవడంతో ఎస్‌డిఎఫ్ రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్లు 6.75శాతంలో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని దాస్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2023 మార్చి-ఏప్రిల్‌లో తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. 2023-24లో ద్రవ్యోల్బణం 4శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వసతి ఉపసంహరణపై దృష్టి సారించాలని ఎంపీసీలో నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్‌బీఐ గవర్నర్ శక్తిదాస్ ప్రకటన