LOADING...
Donald Trump: మోదీ స్నేహితుడే అయినా.. రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు : ట్రంప్‌ 
మోదీ స్నేహితుడే అయినా..రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు: ట్రంప్‌

Donald Trump: మోదీ స్నేహితుడే అయినా.. రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు : ట్రంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ప్రకటించారు. బ్రిటన్‌ పర్యటనలో భాగంగా గురువారం ఆయన చెకర్స్‌లో బ్రిటిష్‌ ప్రధానమంత్రి స్టార్మర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేస్తున్న యుద్ధాన్ని తాను ఆపలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడే అయినప్పటికీ, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై ఎక్కువ సుంకాలను విధించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

వివరాలు 

మోదీకి ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పా: ట్రంప్ 

"భారత్‌ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకపోతే ధరలు పడిపోతాయి. అలా అయితే పుతిన్‌ చేతులెత్తక తప్పదు. ఆయనకు మరో మార్గం ఉండదు" అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అలాగే, "మాకు భారత్‌తో ఉన్న అనుబంధం మీకందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ నాకు చాలా దగ్గర. ఇటీవలే ఆయనకు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. మాకు సుహృద్భావ సంబంధాలున్నాయి. అయినప్పటికీ సుంకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.