Page Loader
Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ
బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ

Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకు డిపాజిటర్ల హక్కులు, ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాల్లో నామినీల పేర్లను మాత్రమే పొందుతున్న పరిస్థితిని మార్చి, వారి ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని కూడా నమోదు చేయాలనే ప్రతిపాదనపై ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నుంచి స్వీకరిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం 'క్లెయిమ్ చేయని డిపాజిట్లు' (Unclaimed Deposits) సంఖ్యను తగ్గించడం అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ఆర్థిక రంగంలోని ముఖ్యమైన అంశంగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్య

ఇటీవల పార్లమెంటు ఆమోదించిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024 ప్రకారం,ప్రతి ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం ఖాతాదారులకు లభిస్తుంది. డిపాజిట్లు చేయడం లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తీసుకోవడం వంటి సందర్భాల్లో నామినీల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నామినీల ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటి సమాచారాన్ని కూడా తప్పనిసరిగా పొందాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఇందుకోసం 1985లో రూపొందించిన బ్యాంకింగ్ కంపెనీస్ (నామినేషన్) రూల్స్‌ ను నవీకరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక రంగంలోని ముఖ్యమైన అంశంగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

క్లెయిమ్ చేయని డిపాజిట్లు.. ఆర్‌బీఐకి బదిలీ

ఈప్రక్రియకు సంబంధించి ఒక అధికారి'ఎకనమిక్ టైమ్స్'కు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఖాతాదారుల వివరాలు మారిన సందర్భాల్లోనూ,నామినీల ఇమెయిల్,ఫోన్ వివరాల ద్వారా వారిని సంప్రదించడం సాధ్యమవుతుందన్నారు. కొంతమందివ్యక్తులు వ్యక్తిగతకారణాల వల్ల పొదుపు లేదా కరెంట్ ఖాతాలను కొనసాగించకపోవడం, వాటిని మూసివేయకపోవడం,కాల పరిమితి ముగిసినా డిపాజిట్లను ఉపసంహరించకపోవడం వంటి కారణాలతో డిపాజిట్లు క్లెయిమ్ కాని పరిస్థితిలోకి వెళ్తున్నాయని తెలిపారు. మరికొంతమంది ఖాతాదారుల మృతి అనంతరం వారి చట్టబద్ధ వారసులు లేదా నామినీలు ముందుకు రాకపోవడం వల్ల డిపాజిట్లు బ్యాంకుల్లోనే ఉండిపోతున్నాయి. ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్లు సాధారణంగా 10సంవత్సరాలు బ్యాంకుల్లో ఉండిన తరువాత ఆర్‌బీఐకి బదిలీ చేయాల్సి వస్తుంది. ఈసమస్య తీవ్రతను తగ్గించేందుకు,డిపాజిట్లు మరింత సమర్థవంతంగా నామినీలకు చేరేవిధంగా చర్యలు చేపట్టేందుకు ఆర్‌బీఐ కార్యాచరణను ప్రారంభించింది.