RBI : ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఎలక్ట్రానిక్ చెక్కులు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్ బి ఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ చెక్కులు (ఈ-చెక్స్) ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. 'పేమెంట్స్ విజన్-2028' పేరుతో విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఈ విషయాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ-చెక్స్ ప్రవేశపెట్టే యోచన కాగితపు చెక్కుల సౌలభ్యాన్ని, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వేగాన్ని కలిపి ఈ-చెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. దీనివల్ల చెక్కుల వినియోగం మరింత సురక్షితంగా, వేగవంతంగా మారే అవకాశం ఉంది.
వివరాలు
డిజిటల్ పేమెంట్స్‌పై మరింత నియంత్రణ
డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు, పేమెంట్ సంస్థలను తన నియంత్రణలోకి తీసుకురావడంపై ఆర్బీఐ ఆలోచిస్తోంది. అంతేకాక వినియోగదారులు మధ్యలోనే డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (ఎనేబుల్/డిసేబుల్) సౌకర్యాన్ని అందించే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కేవలం కార్డు లావాదేవీలకే పరిమితం.
వివరాలు
భద్రతకు ప్రాధాన్యం
అనధికారిక డిజిటల్ లావాదేవీల వల్ల జరిగే నష్టానికి సంబంధించి కొత్త విధానాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఖాతాదారుడి బ్యాంక్ (ఇష్యూయర్) మరియు లబ్ధిదారుడి బ్యాంక్ రెండూ సంయుక్తంగా బాధ్యత వహించే విధానం తీసుకురావాలని చూస్తోంది. అలాగే చెక్కుల డిజైన్, భద్రతా ఫీచర్లను సమీక్షించి మోసాలను తగ్గించే చర్యలు చేపట్టనుంది.
వివరాలు
ఇతర కీలక ప్రతిపాదనలు
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో వైట్ లేబుల్ సొల్యూషన్ల ప్రవేశం అసిస్టెడ్ పేమెంట్ ప్రొవైడర్లను నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం బ్యాంకింగ్ ఖాతాదారులకు సులభమైన పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్ ఏర్పాటు మొత్తంగా 'పేమెంట్స్ విజన్-2028' ద్వారా డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా, వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.