Page Loader
ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం 
రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు సంస్థలో వ్యవస్థీకృత లోపాలను గుర్తించినట్లు సివిల్‌ ఏవియేషన్‌ ప్రకటించింది. ఇండిగో కార్యకలాపాలు, ట్రైనింగ్, ఇంజినీరింగ్‌ విధానాలకు సంబంధించి రిపోర్టుల్లో లోపాలన్నాయని నిర్థారించింది. ఈ నేపథ్యంలోనేే రూ.30 లక్షల భారీ ఫైన్ విధించింది. ఇటీవలే ఇండిగోకు చెందిన ఏ321 విమానం తోక భాగం రన్‌వేను తాకింది. 2023లో తొలి 6 నెలల్లో 4సార్లు ఇలాగే జరిగినట్లు DGCA పేర్కొంది. దీంతో INDIGOపై స్పెషల్ ఆడిట్‌ చేపట్టింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాలని గతంలోనే నోటీసులు ఇచ్చింది. ఇండిగో సమాధానంతో సంతృప్తి చెందని డీజీసీఏ రూ.30 లక్షల ఫైన్ విధించింది. విమాన తయారీ భాగాలను డీజీసీఏ నిబంధనలకు లోబడి సవరించుకోవాలని ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండిగో రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం