Page Loader
ఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు
ఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు

ఇండిగో విమానంలో మహిళపై లైగింక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల పాల్పడిన ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల మహిళా డాక్టర్ పై ఫ్రొపెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇండిగో ఎయిర్ లైన్స్‌లో చోటు చేసుకుంది. నిందితుడు ఫ్రొపెసర్ రోహిత్ శ్రీవాస్తవను జ్యుడిషియల్ కస్టడీకి తరలించగా.. అనంతరం అతడికి బెయిల్ మంజూరైంది. విమానంలో ఫ్రొపెసర్, వైద్యురాలు పక్కపక్కనే కుర్చున్నారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి విమానం ముంబైకి బయలుదేరింది.

Details

నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఆ సమయంలో నిందితుడు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడు శ్రీవాస్తవ తనను అనుచితంగా తాకినట్లు బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరగడంతో అక్కడే ఉన్న సిబ్బంది గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించారు. ఈ విషయంపై బాధితురాలు సహర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, శ్రీవాస్తవపై ఐపీసీ సెక్షన్ 354, 352 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఎటువంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.