Reliance spinner: స్పోర్ట్స్ డ్రింక్స్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ సంస్థ.. స్పిన్నర్ పేరిట బ్రాండ్ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
శీతల పానీయాల మార్కెట్లోకి కాంపా కోలా ద్వారా ప్రవేశించిన రిలయన్స్.. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రింక్స్ విభాగంలో అడుగుపెట్టింది.
భారత మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి 'స్పిన్నర్' (Reliance Spinner) అనే కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది.
ఈ డ్రింక్‌ను రూ.10కే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్పిన్నర్‌ను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఐపీఎల్‌లోని వివిధ జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
లెమన్, ఆరెంజ్, నైట్రో బ్లూ ఫ్లేవర్లలో ఈ స్పోర్ట్స్ డ్రింక్ లభ్యం కానుంది.
వివరాలు
హైడ్రేషన్ కోసం ప్రత్యేకంగా డిజైన్
ఫిట్‌నెస్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేకమైన డ్రింక్‌ను తీసుకొచ్చినట్లు రిలయన్స్ పేర్కొంది.
వ్యాయామం చేసేటప్పుడు, క్రీడల్లో పాల్గొనేటప్పుడు శరీరం ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది.
వాటిని తిరిగి శరీరానికి అందించేందుకు 'స్పిన్నర్' తోడ్పడుతుందని వివరించింది.
ఈ బ్రాండ్ ప్రచారాన్ని బలోపేతం చేయడానికి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్లతో కలసి జాతీయ స్థాయిలో మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టింది.
రానున్న మూడేళ్లలో స్పోర్ట్స్ బేవరేజెస్ మార్కెట్‌ను 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
వివరాలు
స్పిన్నర్ - గేమ్ ఛేంజర్
స్పిన్నర్ బ్రాండ్ పరిచయం కోసం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు.
ఒక క్రీడాకారుడిగా హైడ్రేషన్ యొక్క ప్రాముఖ్యత తనకు తెలుసునని, స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
కేవలం అథ్లెట్లకే కాకుండా, హైడ్రేట్‌గా ఉండాలని ఆశించే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు ఈ డ్రింక్‌ను అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఓఓ కేతన్ మోదీ తెలిపారు.