Page Loader
'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!
వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!

'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ 'X' (మాజీ ట్విటర్) భారత వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ సంస్థ సబ్‌స్క్రిప్షన్ ధరలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త ధరలను ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం, సబ్‌స్క్రిప్షన్ ధరలు 25 శాతం నుంచి 47 శాతం వరకు తగ్గినట్టు సంస్థ స్పష్టం చేసింది. వెబ్ వెర్షన్ ధరలు ఇలా ఉన్నాయి బేసిక్ ప్యాక్: నెలకు రూ.244 నుంచి రూ.170కి తగ్గింపు ప్రీమియం ప్యాక్: రూ.650 నుంచి రూ.427కి తగ్గింపు ప్రీమియం+ ప్యాక్: రూ.3,470 నుంచి రూ.2,570కి తగ్గింపు

Details

యాప్ వెర్షన్ ధరలు ఇలా మారాయి

బేసిక్ ప్యాక్: నెలకు రూ.244 నుంచి రూ.170కి తగ్గింపు ప్రీమియం ప్యాక్: రూ.900 నుంచి రూ.470కి తగ్గింపు ప్రీమియం+ ప్యాక్: రూ.5,130 నుంచి రూ.3,000కి తగ్గింపు ఈ తగ్గింపుతో మరింత మంది వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తాజా నిర్ణయం ఇండియన్ యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లను అందించే దిశగా మలుపు తిప్పింది.