Page Loader
Retail inflation: రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో తగ్గుదల.. 5.48%గా నమోదు
రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో తగ్గుదల.. 5.48%గా నమోదు

Retail inflation: రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో తగ్గుదల.. 5.48%గా నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో నవంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. అక్టోబర్‌లో 6.21 శాతానికి చేరిన ఈ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గిపొయింది. ఇది ఆర్‌ బి ఐ లక్షిత స్థాయిలోనే ఉన్నా, ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గడంతో ఈ డౌన్‌ఫాల్‌ సాధ్యమైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04 శాతానికి చేరింది. ఇది అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉండగా, గతేడాది నవంబరులో 8.70 శాతంగా నమోదు కావడం విశేషం. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల ధరల్లో తగ్గుదల కన్పించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2023 జులై-ఆగస్టు మధ్యకాలంలో 3.6 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో 5.5 శాతం, అక్టోబర్‌లో 6.2 శాతానికి చేరింది.

Details

 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన

ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.. పారిశ్రామికోత్పత్తి కూడా అక్టోబర్‌లో నెమ్మదించింది. మైనింగ్‌, విద్యుత్‌, తయారీ రంగాల్లో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.5 శాతానికి తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయంలో ఈ వృద్ధి 11.9 శాతంగా నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో తయారీ రంగం 4.1 శాతం వృద్ధి నమోదు చేయగా, మైనింగ్‌ 0.9 శాతం, విద్యుత్‌ ఉత్పత్తి 2 శాతం వృద్ధి చూపించింది. 2023 ఏప్రిల్‌-అక్టోబర్‌ కాలంలో పారిశ్రామికోత్పత్తి 4 శాతం వృద్ధి నమోదైంది, గత ఏడాది ఇదే కాలంలో 7 శాతం వృద్ధి చూపించింది.