
Retail Inflation: 67 నెలల కనిష్ఠానికి తగ్గినా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం
ఈ వార్తాకథనం ఏంటి
అనేక త్రైమాసికాలుగా పెరిగిన ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న భారతీయ ప్రజలకు తాజా గణాంకాలు ఊరటనిచ్చే వార్తను అందించాయి.
మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 67 నెలల కనిష్ఠ స్థాయికి చేరిందని సమాచారం.
గత నెలలో ఇది 3.61 శాతంగా ఉండగా, ఇప్పుడు ఇది 3.34 శాతానికి తగ్గిందని అధికారిక గణాంకాలు తెలియజేశాయి.
అసలే భారత రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్న ద్రవ్యోల్బణం స్థాయి 4 శాతానికి కంటే తక్కువగా ఉండటమే లక్ష్యం.
ఈ లక్ష్యాన్ని రెండు నెలలుగా ద్రవ్యోల్బణం చేరుకోవడం విశేషం.ఇటీవల ఆర్బీఐ గవర్నర్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ చేసిన ప్రకటనలో, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినట్లు, ద్రవ్య విధానాలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు.
వివరాలు
రాబోయే నెలల్లో ఇది 4 శాతం కన్నా తక్కువ స్థాయికి దిగొచ్చే అవకాశం
ఇకపోతే, మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 2.96 శాతానికి పడిపోయింది.ఇది ఫిబ్రవరిలో 3.75 శాతంగా నమోదు కావడం గమనార్హం.
మొత్తంగా 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదయ్యింది.
అయితే రాబోయే నెలల్లో ఇది 4 శాతం కన్నా తక్కువ స్థాయికి దిగొచ్చే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది.
దీనితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 3.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని, రెండవ త్రైమాసికంలో ఇది 3.9 శాతానికి చేరుతుందని కేంద్ర బ్యాంక్ తెలిపింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత వేగంగా తగ్గించేందుకు అవకాశం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.