Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,100 ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభంలో సూచీలు స్వల్పంగా స్థిరంగా ప్రారంభమై, ఇంట్రాడే సమయంలో గణనీయమైన లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్, రిలయన్స్ కంపెనీల షేర్లలో కొనుగోలును ప్రోత్సహించడం సూచీలకు కలిసొచ్చింది. ఈ కారణంగా, గత సెషన్‌లో నష్టాల పాలైన సూచీలు ఈ వారాంతం సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ సూచీ 24,100 పాయింట్లను పైన ముగిసింది. సెన్సెక్స్ 79,032.99 పాయింట్ల వద్ద ప్రారంభమైంది,ఇది గత ముగింపుతో సమానంగా ఉంది. ఆ తర్వాత కొనుగోలుకారుల మద్దతుతో సూచీ భారీ లాభాలను నమోదుచేసుకుంది.
బంగారం ఔన్సు ధర 2662 డాలర్లు
ఇంట్రాడేలో 79,923.90 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.49 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్ ధర 72.67 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2662 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.