Page Loader
Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే
ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే

Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా ఓ కొత్త ఫీచర్, మరోవైపు వరుస నోటిఫికేషన్ల దాడి - ఇవన్నీ యూజర్లను వారి దైన దైనందిన పనులనుంచి పక్కదారి పడేసేస్తున్నాయి. ఏ విషయంపైనా కేంద్రీకృతంగా శ్రద్ధ పెట్టాలంటేనే కష్టంగా మారిపోయింది. ఈ సాంకేతిక మాయాజాలం నుంచి ఎలా బయటపడాలి? దీనిపై గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ ఉపయోగకరమైన సూచన ఇచ్చారు. తన అనుభవాన్ని పంచుకుంటూ ష్మిత్ చెప్పారు - ' 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువతతో నేను కలిసి పనిచేస్తున్నాను. వాళ్లు నన్ను ఒక ప్రశ్న అడిగారు.

Details

తన

ఇన్ని ఆన్‌లైన్ డిస్ట్రాక్షన్ల మధ్య మనస్సును ఎలా ఒకే విషయంలో నిలబెట్టుకోవాలి? దానికి నా సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయండి.'' ప్రకటనలు, వినోదాత్మక కంటెంట్‌, సబ్‌స్క్రిప్షన్‌లను కావాలనే మన దృష్టిని మళ్లించేలా రూపొందిస్తున్నారని ఆయన తెలిపారు. మనిషి 70 వేల ఏళ్లుగా ఎలాంటి టెక్నాలజీ లేకుండానే జీవించాడని గుర్తుచేశారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఎక్కువసేపు టెక్‌ ప్రపంచంలోనే మునిగిపోతే - మన ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందని, గుర్తుంచుకోవడంలో అంతరాలు ఏర్పడతాయని, ఆందోళన కూడా పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారని చెప్పారు.

Details

టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి

ఇంకొకవైపు టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాకుండా, దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కూడా అవసరమని శిఫారసు చేస్తున్నారు నిపుణులు. Gen Z యువత ఏఐ టూల్స్‌ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని, నిరంతరం ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం వదిలేయాలని పర్‌ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ సూచించారు. రోజురోజుకీ వేగంగా మారుతున్న ఈ ఏఐ ప్రపంచంలో మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే పెద్ద పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించారు. సాంకేతికతతోపాటు అభివృద్ధి చెందడమంటే తేలికైన పని కాదని స్పష్టం చేశారు.