
SBI: స్టేట్‌బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్ చెబుతున్నట్లు వీడియోలు.. కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల్లో"పెద్దఎత్తున రిటర్నులు" అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్‌మెంట్ సభ్యుల పేరుతో కొన్ని నకిలీవీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈవీడియోలపై స్పందించిన ప్రభుత్వ రంగ బ్యాంక్,ఇవి పూర్తిగా నకిలీ వీడియోలు అని స్పష్టం చేసింది.ఈవిషయాన్ని SBI'ఎక్స్'వేదికపై ఒక పోస్ట్ ద్వారా ప్రజలకు తెలియజేసింది.
"బ్యాంక్ మేనేజ్‌మెంట్ సభ్యులుగా గుర్తించబడ్డ వ్యక్తులు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డీప్‌ఫేక్ వీడియోలను నమ్మకండి.ఆ వీడియోలో సూచించిన పథకాలతో SBIకి లేదా బ్యాంక్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదు.ఈవీడియోలలో ప్రజలకు పెట్టుబడులు పెట్టమని చెప్పడమే కాకుండా,అతి పెద్ద లాభాల హామీ ఇవ్వబడుతోంది.ఇది పూర్తిగా అవాస్తవమైన విషయం.SBI అలాంటి మోసాలను ప్రోత్సహించదు.ప్రజలు అప్రమత్తంగా ఉండి,ఇలాంటి మోసాలకు బలికాకుండా జాగ్రత్త వహించాలని' అని SBI తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ట్వీట్
ALERT - PUBLIC CAUTION NOTICE pic.twitter.com/iIpTusWCKH
— State Bank of India (@TheOfficialSBI) December 16, 2024