Page Loader
ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్
ఎస్అడ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్

ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్

వ్రాసిన వారు Stalin
May 19, 2023
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ భారత వృద్ధి రేటుపై కీలక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం సార్వభౌమ రేటింగ్‌ను స్థిరమైన దృక్పథంతో 'బీబీబీ' వద్ద కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. 2023లో భారత వృద్ధి రేటు 6శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ సంస్థ చెప్పింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో దేశం మంచి ఆర్థిక మూలాధారాలు, వృద్ధి అవకాశాలపై విశ్వాసాన్ని రేటింగ్ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొటున్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కనబరుస్తోందని ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది.

రేటింగ్

2027 నాటికి జీడీపీలో ద్రవ్య లోటు 7.3శాతం

'బీబీబీ' అనేది అత్యల్ప పెట్టుబడి గ్రేడ్ రేటింగ్. ఇది మితమైన క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. స్థిరమైన దృక్పథం, ఆరోగ్యకరమైన ఆదాయ వృద్ధి భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుస్తందని ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. భారతదేశ పబ్లిక్ ఫైనాన్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఆర్థిక కార్యక్రమాల పెంచడం కోసం ప్రభుత్వం మూలధన వ్యయ కేటాయింపులను భారీగా కేటాయిస్తోందని ఎస్ఎండ్‌పీ గుర్తించింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో ద్రవ్య లోటు 7.3%కి చేరుతుందని ఏజెన్సీ అంచనా వేసింది. నికర సాధారణ ప్రభుత్వ రుణం వచ్చే మూడేళ్లలో జీడీపీలో 85% కంటే తక్కువగా స్థిరీకరించబడుతుందని అంచనా వేసింది.