Page Loader
Jane Street: 21 రోజుల్లో రూ.4,843 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్ వ్యూహాలకు సెబీ షాక్!
21 రోజుల్లో రూ.4,843 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్ వ్యూహాలకు సెబీ షాక్!

Jane Street: 21 రోజుల్లో రూ.4,843 కోట్ల లాభం.. జేన్ స్ట్రీట్ వ్యూహాలకు సెబీ షాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న బలహీనతలను లక్ష్యంగా చేసుకుని, అమెరికాకు చెందిన ప్రముఖ ట్రేడింగ్ సంస్థ జేన్‌ స్ట్రీట్ పెద్ద ఎత్తున లాభాలు గడించింది. ఈ విషయమై వెలుగులోకి రాగానే, భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పందించి, ఆ సంస్థ సంపాదించిన మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్లలో వేయాలని ఆదేశించింది. అయితే, ఈ ఘటన భారత స్టాక్ మార్కెట్‌ వ్యవస్థలోని లోపాలను మరోసారి స్పష్టంగా చూపించింది.

వివరాలు 

మార్కెట్‌లో మినిమల్ మార్పులకు గరిష్ఠ లాభాలు 

పురోగతిగా క్యాష్ మార్కెట్‌లో షేర్ల ధరలు స్వల్పంగా మారితే, ఆ ప్రభావం ఆప్షన్స్ మార్కెట్‌పై భారీగా పడుతుంది. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన జేన్‌ స్ట్రీట్, విభిన్న వ్యూహాలు రూపొందించి భారత మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఈ వ్యూహాల ఫలితంగా, 2023 జనవరి నుంచి 2025 మార్చి 31 వరకు జేన్‌ స్ట్రీట్ మొత్తం రూ.43,289 కోట్లు లాభం సంపాదించింది. సెబీ తాజా విచారణ ప్రకారం, కేవలం 21 ట్రేడింగ్ రోజుల్లోనే రూ.4,843 కోట్ల లాభం గడించింది. 2024 జనవరి 17 సహా 14 నిఫ్టీ ఎక్స్‌పైరీ డేట్ల విశ్లేషణ తాజాగా, 2024 జనవరి 17తో పాటు మరిన్ని బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ తేదీలలో జేన్ స్ట్రీట్ అనుసరించిన వ్యూహాలను సెబీ విశ్లేషించింది.

వివరాలు 

మార్కెట్ సూచీలు ఎలా పనిచేస్తాయంటే.. 

స్టాక్ మార్కెట్లో వివిధ రంగాల సూచీలు ఉన్నాయి. వీటిలోని స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక కంపెనీ షేరు ధర పెరిగితే లేదా పడితే, ఆ సెక్టార్‌ సూచీలో మార్పులు జరుగుతాయి. దీంతో, షేర్ల ధరలను కావాలనే పెంచి లేదా తగ్గించి, ఆ ఆధారంగా ఆప్షన్ మార్కెట్లో లాభాలు సంపాదించవచ్చు. జేన్‌ స్ట్రీట్ ఇదే చేసింది.

వివరాలు 

మూడు ప్రధాన వ్యూహాలు 

1. మొదటి వ్యూహం - ఎక్స్‌పైరీ రోజున దూకుడుగా ట్రేడింగ్‌ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజున ఉదయం,కీలక కంపెనీల స్టాక్స్,ఫ్యూచర్స్‌ను పెద్దఎత్తున కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆప్షన్స్ మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీపై షార్ట్ పొజిషన్ తీసుకుంది. మధ్యాహ్నం అవే స్టాక్స్‌ భారిగా అమ్ముతూ,క్యాష్ మార్కెట్‌ మీద ప్రభావం చూపింది. షేర్ల అమ్మకాల వల్ల బ్యాంక్ నిఫ్టీ పడిపోయి,ఆప్షన్ షార్ట్ పొజిషన్ల విలువ భారీగా పెరిగింది.చివరికి లాభాలు తీయగలిగింది. 2. రెండో వ్యూహం - మార్కెట్ ముగిసే సమయానికి ముందే లాభాలు మార్కెట్‌ ముగిసే ముందు 2గంటల వ్యవధిలో,స్టాక్స్,ఫ్యూచర్స్,బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌ భారీగా విక్రయించింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్‌లో షార్ట్ పొజిషన్ తీసుకుని,మార్కెట్ క్లోజింగ్‌ సమయానికి సాఫీగా లాభాలు సేకరించింది.

వివరాలు 

మూడు ప్రధాన వ్యూహాలు 

3. మూడో వ్యూహం - లాంగ్ పొజిషన్ ద్వారా లాభాలు చివరి రెండు గంటల్లో నిఫ్టీ సూచీలో కీలక షేర్లను భారీగా కొనుగోలు చేసింది. అదే సమయంలో నిఫ్టీ ఆప్షన్స్‌ మార్కెట్‌లో లాంగ్ పొజిషన్ తీసుకుంది. షేర్ల ధరలు పెరగడంతో, ఆప్షన్ విలువలు కూడా పెరిగి, మంచి లాభాలు వచ్చాయి. మూడు సంస్థలతో వ్యూహాత్మక దోపిడీ జేన్ స్ట్రీట్, భారత మార్కెట్లో ఈ వ్యాపారాలు నిర్వహించేందుకు మూడు సంస్థలను రిజిస్టర్ చేసుకుంది: జేన్‌ స్ట్రీట్ ఆసియా ట్రేడింగ్ లిమిటెడ్ జేన్‌ స్ట్రీట్ ఇండియా ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జేన్‌ స్ట్రీట్ ఆసియా ఎల్ఎల్సీ

వివరాలు 

మొత్తం లాభనష్టాల గణాంకాలు - సెబీ నివేదిక ప్రకారం 

ఒక సంస్థ క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ఆర్డర్లు పెడుతుంటే, మరో సంస్థ అదే సమయంలో ఆప్షన్స్ మార్కెట్లో అనుసంధానమైన వ్యాపారాలు చేస్తూ లాభాలు గడించింది. కేవలం 21 రోజుల్లో రూ.4,843 కోట్లు లాభం 2023 జనవరి - 2025 మార్చి మధ్యలో రూ.43,289 కోట్లు సంపాదించటం అయితే, ఈ కాలంలో ఆప్షన్స్‌లో రూ.7,208 కోట్లు నష్టం ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లు నష్టం ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.288 కోట్లు నష్టం కూడా వాటిల్లినట్టు సెబీ వెల్లడించింది.