
SEBI: హెచ్‌డీబీ ఫైనాన్షియల్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓలకు సెబీ బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థలైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హీరో ఫిన్‌కార్ప్ ఐపీఓల రాక ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
ప్రీ-ఐపీఓ షేర్ల విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఉందని అనుమానిస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఈ సంస్థలకు అనుమతుల జారీ విషయంలో జాప్యం చేస్తోందని వార్తలు వెలువడుతున్నాయి.
హెచ్‌డీబీ ఫైనాన్షియల్, హీరో ఫిన్‌కార్ప్ తమ ఐపీఓ ప్రణాళికను గతేడాదే ప్రకటించాయి. మదుపర్లు ఈ పబ్లిక్ ఇష్యూల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ సెబీ మాత్రం ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేయలేదు. హీరో ఫిన్‌కార్ప్ గత ఏడాది ఆగస్టులోనే తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసుకుంది.
Details
ఆరోపణలను తోసిపుచ్చిన హీరో ఫిన్‌కార్ప్, హెచ్‌డీబీ
అయితే ఎనిమిది నెలలైనా దానికి ఆమోదం రాలేదు. అదే విధంగా, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ దరఖాస్తు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంది.
కంపెనీల చట్టం ప్రకారం అన్‌లిస్టెడ్ కంపెనీలు ఏకకాలంలో 200 మందికి మించి వాటాదారులను చేర్చుకోవడానికి వీలులేదు.
ఒక్కసారిగా 50 మందికంటే ఎక్కువమందికి ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా షేర్లను విక్రయించరాదు. ఆరు నెలల వ్యవధిలో పబ్లిక్ షేర్ హోల్డర్లకు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా షేర్లు జారీ చేస్తే, దాన్ని పబ్లిక్ ఇష్యూగా పరిగణిస్తారు.
ఈ నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఉందన్న అనుమానంతో సెబీ తుది ఆమోదంలో జాప్యం చేస్తోందని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే హీరో ఫిన్‌కార్ప్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి.