
DeepSeek: ఏఐ రంగంలో సంచలనం.. చైనా డీప్‌సీక్‌పై సైబర్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్ కంపెనీ 'డీప్‌సీక్' తాజాగా సమస్యల్లో పడింది. ఈ సంస్థ అకస్మాత్తుగా సైబర్ దాడికి గురైంది. తమ సేవలపై జరిగిన సైబర్ దాడి కారణంగా, కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని డీప్‌సీక్ తెలిపింది. ఇటీవలి కాలంలో డీప్‌సీక్ ఆర్1 అనే ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉండటంతో, ఈ సంస్థ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఈ మోడల్‌కు యూజర్ల నుండి విశేష ఆదరణ లభించింది. సోమవారం, డీప్‌సీక్ డౌన్‌లోడ్ కోసం పోటీ పెరిగింది. యూపిల్ ఐఫోన్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో నంబర్ వన్ డౌన్‌లోడెడ్ ఫ్రీ యాప్‌గా నిలిచింది.
Details
గంటన్నర పాటు నిలిచిపోయిన సేవలు
ఈ కారణంగా సంస్థ సర్వీసులు గంటన్నర పాటు నిలిచిపోయాయి. ఫలితంగా, చైనా టెలిఫోన్ నంబర్లున్న వారికే సైన్ అప్ చేసే అవకాశమిచ్చారు. ఈ సమస్యపై సంస్థ ప్రకటన విడుదల చేస్తూ, సైబర్ దాడి కారణంగానే రిజిస్ట్రేషన్ సేవలను పరిమితం చేశామని తెలిపింది. కానీ ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్లు యథావిధిగా తమ సేవలను వినియోగించవచ్చని పేర్కొంది. ఈ మోడల్‌పై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, 'చైనా డీప్‌సీక్ ఏఐ విడుదల మన పరిశ్రమలకు మేలుకొలుపుగా భావించాలని, ఈ పోటీలో గెలవడానికి మరింత దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతలను తీసుకొచ్చే పరిష్కారాలను వెతకాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
టెక్ పరిశ్రమపై ప్రభావం
డీప్‌సీక్ ప్రభావం అమెరికా టెక్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా ఎన్విడియా టెక్ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసింది. డీప్‌సీక్ తమ ఏఐ మోడల్స్‌ను తక్కువ ధరలో తయారు చేసినట్లు పేర్కొంది. ఈ కారణంగా సోమవారం మార్కెట్‌లో ఎన్విడియా షేర్లు 17 శాతం పడిపోయాయి. ఈ మేరకు కంపెనీ మార్కెట్ విలువలో 593 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసింది. ఇది షేర్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టం. మైక్రోసాఫ్ట్, మెటా షేర్లు కూడా నష్టాలు చవిచూశాయి.