Stock market:నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న బలహీన సంకేతాల ప్రభావం వల్ల బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లపై అమ్మకాలు పెరిగి, సూచీలను దిగజార్చాయి.
ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో నష్టాలు రావడం,మార్కెట్ సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ రోజు సెన్సెక్స్ 78,637.58 పాయింట్ల వద్ద ప్రారంభమై (మునుపటి ముగింపు 78,699.07) కొద్దిసేపటికే 79,092 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.
కానీ,తర్వాత నష్టాల్లోకి జారుకుంది.సెన్సెక్స్ కనిష్ట స్థాయిని 78,077.13వద్ద చేరుకుంది.
చివరకు, 450.94 పాయింట్ల నష్టంతో 78,248.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 168.50 పాయింట్లు నష్టపోయి 23,664.90 వద్ద నిలిచింది.
రూపాయి డాలర్ మారకం విలువ 4పైసలు క్షీణించి 85.52వద్ద స్థిరపడింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధర 73.98 డాలర్లు
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి.
మరోవైపు, జొమాటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధర 73.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది, బంగారం ఔన్సు ధర 2,625 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.