Loading...
Sensex: కుప్పకూలిన సెన్సెక్స్.. 1,250 పాయింట్లకు పైగా పతనం.. కారణాలివే..
కుప్పకూలిన సెన్సెక్స్.. 1,250 పాయింట్లకు పైగా పతనం.. కారణాలివే..

Sensex: కుప్పకూలిన సెన్సెక్స్.. 1,250 పాయింట్లకు పైగా పతనం.. కారణాలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, ఫెడ్ వడ్డీ రేట్లపై ఆందోళనలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వంటి అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో సెన్సెక్స్ 1,210 పాయింట్లు కోల్పోయి 73,620 స్థాయిలో కొనసాగింది. ఇంట్రాడేలో ఒక దశలో 1,246 పాయింట్లు పతనమై 73,582.25 వద్ద కనిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఒక్కటీ లాభాల్లో లేకపోవడం మార్కెట్‌లో అమ్మకాల తీవ్రతను తెలియజేసింది. మొత్తం 30 షేర్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

వివరాలు 

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలివే..

బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 5 శాతానికిపైగా క్షీణించాయి. ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు 2 శాతానికిపైగా పడిపోయాయి.

రిలయన్స్, ట్రెంట్, ఎల్‌అండ్‌టీ తదితర షేర్లు కూడా దాదాపు 2 శాతం వరకు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదపై గణనీయమైన ప్రభావం పడింది.

అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల

అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ గణనీయంగా పెరిగాయి. ఇవి 2007 నాటి స్థాయులకు చేరుకోవడంతో దాదాపు 19 ఏళ్ల గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

బాండ్ ఈల్డ్ సుమారు 5.14 శాతానికి చేరింది. సాధారణంగా బాండ్ ఈల్డ్స్ పెరిగినప్పుడు పెట్టుబడిదారులు అధిక రిస్క్ ఉన్న ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించి డెట్ మార్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఫెడ్ వడ్డీ రేట్లపై ఆందోళనలు

ప్రస్తుతం భారత ఈక్విటీమార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల విక్రయాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు కూడా ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 16న దాదాపు మూడేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది.

అక్టోబర్‌లోనూ మరోసారి రేట్లపెంపు ఉండొచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతున్నాయి.

ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా డాలర్ విలువ,అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడొచ్చు.ఈ ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది.

ADVERTISEMENT

వివరాలు 

పశ్చిమాసియా ఉద్రిక్తతలు

అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి.

అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో క్రూడాయిల్ ధరలపై మళ్లీ ఒత్తిడి పెరిగింది.

కిందటి రోజు బ్రెంట్ క్రూడ్ ధర కొంతకాలం తర్వాత 100 డాలర్ల దిగువకు చేరినప్పటికీ, గురువారం మళ్లీ 104 డాలర్ల స్థాయికి ఎగబాకింది.

ముడిచమురు ధరలు పెరగడం భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలోనూ ఆందోళనలు పెరిగాయి.

ADVERTISEMENT

వివరాలు 

రూపాయి విలువ పతనం

అంతర్జాతీయ పరిణామాలకు తోడు రూపాయి విలువలో బలహీనత కూడా దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.

డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి పరిణామాలు రూపాయిపై ప్రభావం చూపడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో షేర్లలో అమ్మకాలు మరింత పెరిగాయి.

వివరాలు 

IRDAI ప్రతిపాదనల ప్రభావం

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) బీమా రంగానికి సంబంధించి కొత్త నిబంధనలు, సంస్కరణలను ప్రతిపాదించడం కూడా కొన్ని షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది.

ముఖ్యంగా బీమా రంగానికి అనుబంధంగా ఉన్న కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.

పాలసీబజార్‌ను నిర్వహించే పీబీ ఫిన్‌టెక్ షేరు అత్యధికంగా ప్రభావితమై 32శాతానికిపైగా పతనమైంది.

ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్,బజాజ్ గ్రూప్‌కు చెందిన కొన్ని షేర్లలోనూ భారీ అమ్మకాలు నమోదయ్యాయి.

మొత్తంగా చూస్తే.. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు,పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, దేశీయంగా IRDAI ప్రతిపాదనలు వంటి పలు అంశాలు ఒకేసారి ప్రభావం చూపడంతో భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.

ADVERTISEMENT