Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుండి లభిస్తున్న బలహీన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
అలాగే, ఈ వారంలో విడుదల కానున్న కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలపై మదుపర్లు దృష్టిసారించడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ఆరంభించింది.
సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయినట్లు ఉండగా, నిఫ్టీ 23,500 మార్క్ దిగువకు పడిపోయింది.
ఉదయం 9.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో 77,488.95 వద్ద, నిఫ్టీ 116.1 పాయింట్ల నష్టంతో 23,443.85 వద్ద ట్రేడింగ్ జరుగుతున్నాయి.
వివరాలు
97.94 వద్ద రూపాయి మారకం విలువ
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించడంతో, 44 పైసలు నష్టపోయి 97.94 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది.
నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, ఎస్‌బీఐ,కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగగా, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో షేర్లు నష్టాలను చవిచూశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించడంతో,ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
జపాన్ నిక్కీ 0.1%,దక్షిణ కొరియా కోస్పీ 0.13%,ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.31% నష్టాల్లో ఉన్నాయి.
అటు,హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 1.47% లాభంతో ట్రేడవుతోంది.గత శుక్రవారం,అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
డోజోన్స్ 0.99%, నాస్‌డాక్ 1.36%, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.95% మేర పడిపోయాయి.