
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
వరుసగా ఏడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలకు బ్రేక్ పడింది.భారత్‌పై టారిఫ్‌ల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో స్పష్టత రానున్న వేళ,మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
అంతేకాక,వరుస లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర నష్టపోగా,నిఫ్టీ 23,500 దిగువకు చేరుకుంది.దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి.
సెన్సెక్స్ ఉదయం 78,021.45 పాయింట్ల వద్ద(మునుపటి ముగింపు 78,017.19)స్థిరంగా ప్రారంభమై, అనంతరం నష్టాల్లోకి జారుకుంది.
ఇంట్రాడేలో 77,194.22 వద్ద కనిష్ఠాన్ని తాకి,చివరికి 728.69 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద ముగిసింది.
నిఫ్టీ 181.80 పాయింట్లు కోల్పోయి 23,486.85 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో రూ.85.69గా ఉంది.
వివరాలు
మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, జొమాటో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.45 డాలర్లు, బంగారం ఔన్సు 3025 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా ప్రతీకార సుంకాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2 గడువు సమీపిస్తుండడంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
ట్రంప్ దూకుడుగా ముందుకు వెళితే, ఐటీ, ఫార్మా వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు అంచనా.
వివరాలు
మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు
లాభాల స్వీకరణ: గత వారం రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ 5% పైగా పెరగడంతో, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
క్రూడాయిల్ ధరలు: వెనుజువెలా, ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కఠినతరం కావడంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో, భారత్‌పై దిగుమతుల వ్యయం పెరుగుతుందన్న భయాలు సహా ప్రతికూలత ఏర్పడింది.
స్టాక్ మార్కెట్ ఒత్తిడి: ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడం సూచీల పతనానికి కారణమైంది.
అమెరికా మార్కెట్ ప్రభావం: అమెరికాలో డాలర్ ఇండెక్స్, బాండ్ రాబడులు పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.