
Stock market: లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో భారత మార్కెట్లు లాభదిశగా పయనించాయి. నిన్న ట్రేడింగ్ కొంత ఒడిదొడుకుల మధ్య సాగినప్పటికీ, నేడు సూచీలు పుంజుకున్నాయి. బుధవారం ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 82,363 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 50.5 పాయింట్లు పెరిగి 25,110 స్థాయిలో కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.41గా నమోదైంది.
వివరాలు
లాభాలలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు,నిక్కీ
నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌తో ట్రేడ్ డీల్ ఖరారైందని ప్రకటించడంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు, ముఖ్యంగా జపాన్‌లోని నిక్కీ సూచీ లాభాలతో ప్రారంభమయ్యాయి.