LOADING...
Stock Market : సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో.. మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం!
సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో.. మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం!

Stock Market : సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో.. మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతవారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో కళకళలాడాయి. జీఎస్‌టీ సంస్కరణలు, అంచనాలను మించి వచ్చిన జీడీపీ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఫలితంగా సూచీలు నేడు లాభాలను పొందాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల పైగా పెరిగి, నిఫ్టీ 24,600 మార్క్ దాటింది. సెన్సెక్స్ పరిస్థితి ఉదయం 79,828.99 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ప్రారంభంలో కొంత ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు ర్యాలీని ముందుకు నడిపాయి. ఇంట్రాడే గరిష్ఠం: 80,406 పాయింట్లు ముగింపు: 80,364.49 (554.84 పాయింట్లు లాభం)

Details

నిఫ్టీ పరిస్థితి 

198.20 పాయింట్లు పెరిగి 24,625.05 వద్ద స్థిరపడింది. ఆటోమొబైల్, ఐటీ, లోహ రంగ సూచీలు రాణించాయి.

Details

మార్కెట్ ర్యాలీకి కారణాలు 

1. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి, RBI అంచనాలు 6.5% మాత్రమే. మదుపర్లలో ఉత్సాహం పెరిగింది. 2. చైనాలో షాంఘై సహకార సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. 3. ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం అని అమెరికా కోర్టు తీర్పు వెలువడటం కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. 4. గతవారం సూచీలు నష్టపోయినందున కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోలు చేసారు. రూపాయి విలువ మరోవైపు భారత రూపాయి విలువ అతి కనిష్ఠానికి చేరింది. సోమవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే 11 పైసలు క్షీణించి, రూపాయి 88.20 వద్ద ఆల్‌టైం కనిష్ఠ స్థాయిలో ముగిసింది.